లాక్ డౌన్ లో పూజా హెగ్డే ఇలా గడుపుతోంది!

  • తన అన్నదమ్ములతో మసాజ్ చేయించుకున్న పూజా హెగ్డే 
  • తన తండ్రి బర్త్ డే సందర్భంగా కేక్ తయారు
  • అర్ధరాత్రి సమయంలో ఆయనతో కట్ చేయించి సర్ ప్రైజ్ 
లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఇళ్లల్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా, సినీ రంగ ప్రముఖులు లాక్ డౌన్ సమయంలో తాము ఏవిధంగా గడుపుతున్నామో చెబుతూ సరదా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినీ బ్యూటీ పూజా హెగ్డే  కొత్త వంటకాలు ఎలా వండాలో నేర్చుకుంటోంది. అలాగే, గిటార్ ఎలా ప్లే చేయాలో కూడా నేర్చుకుంటున్నట్టు చెప్పిన పూజా హెగ్డే, తాజాగా, తన అన్నదమ్ములతో మసాజ్ చేయించుకుంది. తన తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ కేక్ కూడా తయారు చేసింది. ఆ కేక్ ను అర్ధరాత్రి సమయంలో తన తండ్రితో కట్ చేయించి సర్ ప్రైజ్ చేసింది.

Pooja Hegde
Cine heroine
Lockdown
Massage
Brothers

More Telugu News